చందమామ కథలు

రామాయణం ఉత్తరకాండ – 10

Login to Play your Story!


రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.

రామాయణం ఉత్తరకాండ – 9

Login to Play your Story!


వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు.

రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.

రామాయణం ఉత్తరకాండ – 8

Login to Play your Story!


అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.

రామాయణం ఉత్తరకాండ – 7

Login to Play your Story!


కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు.

రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు…

రామాయణం ఉత్తరకాండ – 6

Login to Play your Story!


రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు “తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది” అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.