క్రీ. శ. 5వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంథంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు. ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్నకథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతిసూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.