1. Eduguru Moorkhulu Mohini Juluri 2:40
  2. Batasarula adhrushtam Amulya Reddy 1:12
  3. Raju gari koti Amulya Reddy 0:58
  4. Kothi Kuthuhalam Amulya Reddy 1:25
  5. Gongura nade Amulya Reddy 2:13
  6. Ganta moginchedhi evaru Amulya Reddy 3:22
  7. Birbal khichidi Amulya Reddy 4:22
  8. Birbal kaki lekkalu Amulya Reddy 1:06
  9. Birbal Jwaram Amulya Reddy 1:13
  10. Swaardam Amulya Reddy 1:29
  11. Vishnu Mahima Amulya Reddy 1:31
  12. Swabhavaniki taggattu Vruthi Amulya Reddy 3:21
  13. Nootiloni Neellu Amulya Reddy 1:00
  14. Naanala Sanchi Amulya Reddy 1:24
  15. Manassaakshi Amulya Reddy 1:11
  16. Attarintiki Daredi Amulya Reddy 1:24
  17. Nakshatrala Lekka Vimala Mare 1:50
  18. Devudu Cheyaleni pani Vimala Mare 2:00

జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ (‘అక్బర్ ద గ్రేట్ గా కూడా ప్రసిద్దుడు) (అక్టోబరు 15, 1542 – అక్టోబర్ 27, 1605).[1][2] 1556 నుండి తాను మరణించినంతవరకు మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన బాల్యనామం బద్రుద్దీన్ ముహమ్మద్ అక్బర్ గా ఉన్ననూ తరువాత అతని పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ గా మార్చబడింది మరియు అతను పుట్టిన తేదీ ఆధికారికంగా అక్టోబర్ 15, 1542 కి మార్చబడింది. నాసీరుద్దీన్ హుమాయున్ కుమారుడు అయిన ఇతడు తన తండ్రి తదనంతరం మొఘల్ సామ్రాజ్యాన్ని 1556 నుండి 1605 వరకు పాలించాడు. మొఘల్ రాజవంశం స్థాపకుడైన బాబర్ యొక్క మనుమడు. 1605 లో అతను మరణించిన సమయానికి, మొఘల్ సామ్రాజ్యం దాదాపుగా 1 లక్ష చదరపు కిలోమీటర్లు వరకు వ్యాపించి ఉంది.

రాజా బీర్బల్, Raja Birbal (1528-1586), అక్బర్ ఆస్థానం లోని “నవరత్నాలలో” ఒక రత్నం. అక్బరు రాజదర్బారు మరియు ప్రభుత్వంలో ఒక మహామంత్రి కూడానూ. అక్బర్ ఇతడిని తన అనుంగునిగా, విశ్వాసపాత్రుడిగా పరిగణించి తన సలహాదారునిగా నియమించుకొన్నాడు. బీర్బల్ మహామేధావి, చతురుడు, హాస్యభరితుడు, మరియు తన సంబద్ధ చాతుర్యానికి, సున్నిత హాస్యానికి, అతిసున్నిత విమర్శకూ చక్కటి ఉదాహరణ. బీర్బల్ తో సంభాషించి గెలవడాని మహామహులు తంటాలు పడేవారు. అక్బర్ ఆస్థానంలోగల ఇంకో చతురుడు ముల్లా దో పియాజా, ఇతను తొట్రుపాటు గలవాడు. బీర్బల్ తొణికేవాడు గాదు. ఈ స్థిరత్వం ప్రజలకు ఇంకా ముగ్దుణ్ణి చేసేవి. అక్బర్ కాలంలో అక్బర్ తరువాత, అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు బీర్బల్ మాత్రమే నంటే అతిశయోక్తి గాదు. చరిత్రకూడా ఇతడికి సమోన్నత గౌరవమిచ్చి, సరియగు స్థానమిచ్చింది.